యూఎస్ నుంచి అజిత్ దోవల్కు ఫోన్కాల్

29 Sep, 2016 08:18 IST|Sakshi
యూఎస్ నుంచి అజిత్ దోవల్కు ఫోన్కాల్

వాషింగ్టన్: భారత జాతీయ భత్రతా సలహాదారు అజిత్ దోవల్ కు అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ సుసన్ రైస్ ఫోన్ చేశారు. ఉడీ ఉగ్రవాద ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ విషయంలో  పాకిస్థాన్ను తగిన చర్యలు తీసుకోవాలని  కోరినట్లు ఆమె దోవల్కు తెలిపారు. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్ర సంస్థలపై పాక్ కఠిన చర్యలు తీసుకుంటుందని తాము భావిస్తున్నట్టు ఆమె వెల్లడించారు.

ఉడీ ఉగ్రదాడి అనంతరం అమెరికా అత్యున్నత అధికారి స్పందించడం ఇదే తొలిసారి. ఉగ్రవాద బాధిత దేశాలకు న్యాయం చేసేందుకు తమ పోరాటాన్ని మరింత ఉదృతం  చేస్తామనే ఒబామా సందేశాన్ని ఆమె దోవల్కు వివరించారు. ఉగ్రవాదులను ఒంటరి చేసేందుకు మరింత సహకారంతో కలిసి పనిచేసేందుకు ఆమెహామీ ఇచ్చారని ఫోన్ కాల్ వివరాలను అమెరికా అధ్యక్షుని అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ వెల్లడించారు.
 
 

మరిన్ని వార్తలు