కశ్మీర్‌లో భద్రత బలగాలను పెంచాలి

18 Nov, 2017 04:30 IST|Sakshi

న్యూఢిల్లీ: శాంతి భద్రతల దృష్ట్యా జమ్మూకశ్మీర్‌లో మరింత బలగాలను పెంచాల్సిన అవసరముందని తాజా సర్వేలో వెల్లడైంది. అమెరికాకు చెందిన ప్యూ రీసర్చ్‌ సెంటర్‌ భారత్‌లో చేసిన సర్వేలో ఈ విషయాలు వెల్లడించింది. సర్వే ప్రకారం.. 63 శాతం మంది ప్రజలు కశ్మీర్‌లో భద్రతా బలగాలను పెంచాలని భావిస్తున్నారు. 64 శాతం మంది ప్రజలు పాక్‌పై వ్యతిరేకంగా ఉన్నారు. ఇది గతేడాదితో పోలిస్తే 9 శాతం ఎక్కువ. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 10 మధ్యలో ఈ సర్వేను నిర్వహించారు.  గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని 2,464 మంది అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నారు. పాతపెద్దనోట్ల రద్దు తర్వాత దేశంలో ఆర్థిక వ్యవస్థ బాగుందని 10 మందిలో ఎనిమిది మంది చెప్పారు.  

మరిన్ని వార్తలు