కాజీపేట్‌లో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ నెలకొల్పాలి 

14 Mar, 2020 03:46 IST|Sakshi

కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 

సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం అనుసరించి కాజీపేట్‌లో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ స్థాపించాలని కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఉదయం ఆయన పార్లమెంటు ఆవరణ లో మీడియాతో మాట్లాడారు. రైల్వే పద్దులపై జరిగిన చర్చలో ఈ అంశంపై కేంద్రాన్ని ప్రశ్నించినట్టు తెలిపారు. కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పా టు చేయాల్సి ఉన్నప్పటికీ, ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని విమర్శించారు. ఏదైనా ఇబ్బందులుంటే స్పష్టత ఇవ్వా లని, కనీసం పీపీపీ పద్ధతిలోనైనా కోచ్‌ ఫ్యాక్టరీ నిర్మించాలని కోరామని వివరించారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడ జాతీయ రహ దారి వెంట రైల్వే లైన్‌ వేస్తే ప్రయాణ సమయం చాలా తగ్గుతుందని పేర్కొన్నారు. రెండు రాజ ధానుల మధ్య హై స్పీడ్‌ ట్రైన్‌ వేస్తే 2 గంటల్లో ప్రయాణం చేయొచ్చని పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు