యూపీలో ‘కల్తీ సారా’కు మరణశిక్షే!

23 Dec, 2017 04:05 IST|Sakshi

లక్నో: కల్తీ సారా అమ్మి అమాయక ప్రజల మరణానికి కారకులయ్యేవారికి మరణశిక్ష విధించే బిల్లును ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ శుక్రవారం ఆమోదించింది. యూపీ ఎక్సైజ్‌(సవరణ) చట్టం–2017 ప్రకారం కల్తీ సారా వల్ల మరణాలు సంభవిస్తే దాని తయారీతో సంబంధమున్న వారికి మరణశిక్ష లేదా యావజ్జీవంతో పాటు రూ.5లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ జరిమానా విధించవచ్చు. కల్తీ సారాతో అంగవైకల్యం సంభవిస్తే సారా తయారీదారుకు గరిష్టంగా పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తారు. రూ.5 లక్షల వరకూ జరిమానా విధించవచ్చు. ఇటీవలి కాలంలో కల్తీసారాతో వరుస మరణాలు సంభవించడంతో సెప్టెంబర్‌లో ఎక్సైజ్‌ చట్టానికి సవరణలు చేసి యూపీ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది.

మరిన్ని వార్తలు