కరోనా కాలం.. ఆ బాబు పేరు ’శానిటైజర్‌’

14 Apr, 2020 13:40 IST|Sakshi

లక్నో : కరోనావైరస్‌ పుణ్యమా అని సామాన్య ప్రజలకు పెద్దగా తెలియని శానిటైజర్‌, లాక్ డౌన్, క్వారంటైన్, ఐసోలేషన్‌ వంటి పదాలు ఇప్పుడు విరివిగా వినిపిస్తున్నాయి. ఇక ఈ సమయంలో పుట్టిన పిల్లలకు తల్లిదండ్రులు కరోనా, కొవిడ్‌-19, లాక్‌డౌన్‌, జనతా లాంటి పేర్లను నామకరణం చేసిన విషయం తెలిసిందే. తాజాగా తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్ జిల్లాలో అటువంటి ఓ ఘటన వెలుగు చూసింది. గత ఆదివారం పుట్టిన మగ పిల్లాడికి ‘శానిటైజర్‌’ అని పేరు పెట్టుకుంది ఓ జంట. ఇది కరోనా లాక్ డౌన్‌  కాలం కావడంతో వారు తమ కుమారుడికి శానిటైజర్ పేరు పెట్టుకున్నారు. 
(చదవండి: కరోనా ఎఫెక్ట్‌: పిల్లలకి వెరైటీ పేర్లు!)

దీనిపై బాలుడి తండ్రి మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు విధిగా ప్రతి ఒక్కరూ శానిటైజర్‌తో చేతులను శుభ్రం చేసుకోవాలని ప్రధాని మోదీ, సీఎం యోగి ఆదిత్యానాథ్‌ చేస్తున్న విజ్ఞప్తితో తాము ప్రేరణ పొంది తమ కుమారుడికి ‘శానిటైజర్‌’ అని నామకరణం చేశామని పేర్కొన్నారు.  ‘ప్రస్తుతం చేతులపైని సూక్ష్మజీవులను తొలగించుకునేందుకు ప్రతివారూ శానిటైజర్ వాడుతున్నారు. దీని వల్ల కరోనా వ్యాప్తికి బ్రేకులు పడుతున్నాయి అందుకే మా కుమారుడికి శానిటైజర్ అనే పేరు పెట్టాం’ అని వివరించారు. ఉత్తరప్రదేశ్‌లోని దొయిరా జిల్లాలో పుట్టిన ఒక  బాబుకు  ‘లాక్‌డౌన్‌’ అని, చత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో జన్మించిన కవలలకు కొవిడ్‌, కరోనా అని నామకరణం చేసిన తెలిసిందే.

మరిన్ని వార్తలు