రూ 5 నుంచి రూ 400 వరకూ వడ్డన

6 May, 2020 18:23 IST|Sakshi

మద్యం ధరల పెంపుతో రూ 2350 కోట్ల రాబడి

లక్నో : మద్యం ప్రియులకు యూపీ ప్రభుత్వం భారీ షాక్‌ ఇచ్చింది. ఒక్కో బాటిల్‌పై బాటిల్‌  పరిమాణం, కేటగిరీని బట్టి రూ 5 నుంచి రూ 400 వరకూ ధరలను పెంచింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో మద్యం ధరల పెంపు నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర ఆర్థిక మంత్రి సురేష్‌ ఖన్నా వెల్లడించారు. మద్యం ధరల పెంపుతో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ 2350 కోట్ల రాబడి సమకూరుతుందని చెప్పారు. దేశీ మద్యం ధరలను బాటిల్‌కు రూ 5 మేర పెంచామని తెలిపారు.

ఇక ఐఎంఎఫ్‌ఎల్‌ మద్యం 500 ఎంఎల్‌ బాటిల్‌ రూ 30 చొప్పున పెరుగుతాయని, ప్రీమియం బ్రాండ్లపై 500 ఎంఎల్‌ పైబడిన బాటిల్స్‌ రూ 50  మేర భారమవుతాయని చెప్పారు. విదేశీ మద్యం బ్రాండ్లు 180 ఎంఎల్‌పై రూ 100, 180 నుంచి 500 ఎంఎల్‌లోపు బాటిల్స్‌పై రూ 200..500 ఎంఎల్‌ పైబడిన బాటిల్స్‌పై రూ 400 చొప్పున ధరలు పెరుగుతాయని మంత్రి వెల్లడించారు. పెరిగిన మద్యం ధరలు ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు.

చదవండి : ఇక‌పై మ‌ద్యం హోం డెలివ‌రీ..ఇవిగో టైమింగ్స్‌

>
మరిన్ని వార్తలు