ఒక్కడే 140 మంది మహిళలతో..

25 Jul, 2016 12:39 IST|Sakshi
ఒక్కడే 140 మంది మహిళలతో..

బరేలి: ఉత్తరప్రదేశ్లో ఓ వ్యక్తి మరీ రొమాంటిక్గా మారాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 140 మంది మహిళలతో శృంగార సంబంధాలను కొనసాగించాడు. చివరికి అతడి అక్రమ సంబంధాల బాగోతం పోలీస్ స్టేషన్కు చేరింది. అయితే అతగాడితో సంబంధమున్న మహిళల జాబితాలో ఓ పోలీసు అధికారిణి కూడా ఉండటం నివ్వెరపరిచింది.

ఈ కేసు విచారణ జరుపుతున్న పోలీసులతో సదరు వ్యక్తి కూతురు వెల్లడించిన విషయాలు ఆశ్చర్యపరిచాయి. మహిళలతో సంబంధాల విషయంలో అతగాడు ఓ ప్రత్యేక పద్దతిని పాటిస్తున్నాడు. దానికోసం ఓ స్పెషల్ డైరీని ఏర్పాటుచేసుకొని.. ఎవరిని.. ఎప్పుడు.. ఎక్కడ.. ఎన్నిసార్లు కలిశాడనే విషయాలను అందులో పొందుపరుస్తున్నాడు. అంతేకాదు ఈ డైరీని చాలా జాగ్రత్తగా ఇంట్లోని ట్రంకుపెట్టెలో భద్రపరుస్తున్నట్లు అతడి కూతురు రోష్ని వెల్లడించినట్లు స్థానిక పత్రిక తెలిపింది. అయితే ఆ వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలు, అతడిపై ఎవరు ఫిర్యాదు చేశారు అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు.
 

మరిన్ని వార్తలు