పులిపై దాడి చేసి చంపేసిన గ్రామస్తులు

26 Jul, 2019 11:17 IST|Sakshi

లక్నో : ఆరేళ్ల పులిని దారుణంగా కర్రలతో కొట్టి చంపేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. పిలిబిత్‌ టైగర్‌ రిజర్వ్‌కు సమీపంలో ఉన్న మతైన గ్రామంలోకి బుధవారం ఓ పులి ప్రవేశించింది. గ్రామస్తుడిపై దాడి చేసి గాయపర్చింది. దాంతో కోపోద్రిక్తులైన గ్రామస్తులు కర్రలతో పులిని వెంబడిస్తూ.. చితకబాదారు. ఈ ఘటనలో దారుణంగా గాయపడిన పులి చనిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. దీనిపై స్పందించిన అటవీ అధికారులు పులిపై దాడి చేసి, చంపినందుకు గాను 31మంది గ్రామస్తుల మీద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పిలిబిత్‌ ప్రాంతంలో ఇలా జంతువులు మీద దాడి చేసి చంపడం ఇదే ప్రథమం అన్నారు. త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకుంటామని తెలిపారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కరోనా: 24 గంటల్లో 601 కేసులు

ఆ లైట్లు ఆర్పకండి: కేంద్రం క్లారిటీ

నోట్లతో ముక్కు తుడుచుకున్న వ్యక్తి అరెస్టు

పరికరాల కొరతతో వైద్యుల ఆందోళన

కొవ్వొత్తుల తర్వాత రంగోలి పోటీలా!?

సినిమా

ప్రధాని పిలుపుపై రామ్‌ చరణ్‌ ట్వీట్‌

పెద్ద మనసు చాటుకున్న నయనతార

వైరస్‌ గురించి ముందే ఊహించా

కరోనా పాజిటివ్‌.. 10 లక్షల డాలర్ల విరాళం!

ఏడాది జీతాన్ని వ‌దులుకున్న ఏక్తాక‌పూర్‌

అమ్మ మాట్లాడిన తీరు చూస్తే భయమేసింది: సైఫ్‌