‘మహమ్మారిని ఆ దేవుడే పంపాడు’

29 Jun, 2020 18:23 IST|Sakshi

 కాంగ్రెస్‌ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారిని శ్రీకృష్ణ భగవానుడే పంపాడని కాంగ్రెస్‌ నేత సూర్యకాంత్‌ దస్మానా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ చానెల్‌ చర్చా కార్యక్రమంలో ఉత్తరాఖండ్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు సూర్యకాంత్‌ మాట్లాడుతూ కరోనా వైరస్‌, కృష్ణ రెండూ ‘క’ శబ్ధంతో మొదలవుతాయని, అందుకే ఈ వైరస్‌ను శ్రీకృష్ణుడే మన వద్దకు పంపారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ నేత వ్యాఖ్యలపై ట్విటర్‌లో నెటిజన్లు ఘాటుగా స్పందించారు. హిందూ దేవతలతో కోవిడ్‌-19ను పోల్చడం పట్ల యూజర్లు ఆయనపై మండిపడ్డారు. చదవండి : 100 రోజుల లాక్‌డౌన్‌.. ఏం జరిగింది?

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా