వైరల్‌; బదిలీ చేయమంటే...అరెస్ట్‌ చేశారు

29 Jun, 2018 14:00 IST|Sakshi
ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయురాలు ఉత్తర బహుగుణ

డెహ్రడూన్‌ : పాపం ఆ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు పాతికేళ్లుగా ఒక ఏజెన్సీ ప్రాంత ప్రాధమిక పాఠశాలలో పనిచేస్తుంది. ఓ మూడు సంవత్సరాల క్రితం ఆమె భర్త చనిపోయాడు. వృద్ధాప్యంలో ఒంటరిగా ఉండలేక పిల్లలు నివాసం ఉంటున్న ప్రాంతానికి ట్రాన్స్‌ఫర్‌ చేయించుకుందామనుకుంది. ఆ విషయాన్ని ముఖ్యమంత్రికి విన్నవిద్దామని వచ్చింది. అయితే సాయం చేయాల్సిన ముఖ్యమంత్రి కాస్తా ఆ మహిళ మీద కోపంతో విరుచుకుపడ్డమే కాక ఆమెను అరెస్ట్‌ చేయండంటూ ఆదేశించారు. వైరల్‌గా మారిన ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తుది.

వివరాల ప్రకారం ఉత్తరాఖండ్‌కు చెందిన ఉత్తర బహుగుణ (57) ఉత్తరకాశిలోని ప్రైమరీ స్కూల్‌లో గత 25 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. మూడేళ్ల​ క్రితం (2015) ఆమె భర్త మరణించారు. దాంతో ఈ వయస్సులో ఒంటరిగా ఉండలేక పిల్లల దగ్గరకు వెళ్లాలని అనుంకుంది. ప్రస్తుతం పిల్లలు నివాసం ఉంటున్న డెహ్రడూన్‌కు బదిలీ చేయించుకోవాలనుకుంది బహుగుణ. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌కి విన్నవించాలనుకుంది. గురువారం ముఖ్యమంత్రి ఆధ్యర్యంలో నిర్వహిస్తున్న ‘జనతా దర్బార్‌’కు వెళ్లింది. అక్కడ ముఖ్యమంత్రితో తాను గత పాతికేళ్లుగా ఒకే ప్రాంతంలో పనిచేస్తున్నానని, ఇప్పుడు తనను డెహ్రడూన్‌కు బదిలీ చేయమని సీఎంను కోరింది.

కానీ బహుగుణను డెహ్రడూన్‌ బదిలీ చేయడం కుదరదన్నారు సీఎం. దాంతో బదిలీ చేయడం ఎందుకు కుదరదో తనకు కారణం చెప్పాలంటూ వాదించడం ప్రారంభించింది బహుగుణ. సహనం కోల్పోయిన ముఖ్యమంత్రి ‘ఆమెను వెంటనే సస్సెండ్‌ చేసి, అరెస్ట్‌ చేయండంటూ కేక’లు వేశారు. దాంతో బహుగుణ ముఖ్యమంత్రిని తిడుతూ సమావేశం నుంచి బయటకు వెళ్లి పోయింది. అనంతరం ‘సీఎం ముఖ్యమైన సమావేశంలో ఉన్నప్పుడు అంతరాయం కల్గించిందనే నేరం’ కింద పోలీసులు బహుగుణను అరెస్ట్‌ చేశారు. కొన్ని గంటల తర్వాత బెయిల్‌ మీద ఆమెను విడుదల చేశారు.

మరిన్ని వార్తలు