దెయ్యాల గ్రామాలే.. క్వారంటైన్‌ సెంటర్లు

15 May, 2020 19:37 IST|Sakshi

డెహ్రాడూన్‌: బతుకుదెరువు కోసం ఊరుకాని ఊరు వచ్చి ఇతర రాష్ట్రాలలో చిక్కుకుపోయిన వలస కార్మికులు లాక్‌డౌన్‌లో సడలింపుల కారణంగా వారి సొంత రాష్ట్రాలకు వెళ్లే అవకాశం కలిగింది. అయితే వలస కూలీలు పెద్ద సంఖ్యలో ఆయా రాష్ట్రాలకు వెళ్తుండడంతో సంబంధిత రాష్ట్రాలు ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి. వలస కార్మికులను క్వారంటైన్‌ చేయాలన్న నిబంధనలతో వారిని ఉంచేందుకు అన్ని రకాల ప్రభుత్వ భవనాలను వాడేస్తున్నారు. అయితే ఉత్తరాఖండ్‌ మరోఅడుగు ముందుకేసి వినూత్నంగా ఆలోచించి.. సరైన వసతులు లేని ప్రాంతాల్లో కొందరు ప్రజలు గ్రామాలను ఖాళీచేసి పట్టణాలకు చేరుకున్నారు. ఇప్పుడు అక్కడ ఎవరూ నివాసం ఉండకపోవడంతో వాటిని పాడుబడిన దెయ్యాల గ్రామాలుగా పిలుస్తుంటారు. చదవండి: లాక్‌డౌన్‌ వేళ ఉద్యోగులకు జొమాటో షాక్‌

అయితే వలస కార్మికులు వేల సంఖ్యలో రాష్ట్రానికి చేరుకుంటూ ఉండటంతో ఉత్తరాఖండ్‌ ఈ ఇళ్లను కూడా వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకుంది. జనావాసం ఉన్న గ్రామాల్లో క్వారంటైన్‌ ఏర్పాటు చేస్తే కరోనా విస్తరించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఈ దెయ్యాల గ్రామాలనే ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో క్వారంటైన్‌ కేంద్రాలుగా వినియోగిస్తున్నారు. కాగా ప్రస్తుతం పౌరి జిల్లాలో సుమారు 200 గ్రామాలలో ఖాళీగా ఉన్న ఇళ్లను శుభ్రం చేయించారు. ఇప్పటికే కొందరిని క్వారంటైన్‌లో ఉంచి అన్ని రకాల ఏర్పాట్లు కల్పిస్తున్నారు. వలస కార్మికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో ప్రస్తుత పరిస్థితుల్లో ఈ దెయ్యాల గ్రామాలే అన్ని విధాలుగా మంచిదని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ఆ దిశగా అడుగులేసింది. చదవండి: హనీట్రాప్‌ కేసులో కీలక వ్యక్తి అరెస్ట్‌ 

మరిన్ని వార్తలు