ఫేస్ బుక్ లో వివాదస్పద ఫొటోలు..యువకుడి అరెస్ట్!

29 Jul, 2014 13:58 IST|Sakshi
ఫేస్ బుక్ లో వివాదస్పద ఫొటోలు..యువకుడి అరెస్ట్!
డెహ్రాడూన్: ఫేస్ బుక్ లో వివాదస్పద ఫొటోలను నకిలీ ఖాతాతో పోస్ట్ చేసిన ఓ యువకుడు కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్ లోని ఉద్దమ్ సింగ్ నగర్ లో చోటు చేసుకుంది. ప్రత్యేకంగా ఓ కమ్యూనిటిని టార్గెట్ చేస్తూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడమే కాకుండా, ట్యాగ్ చేసిన లలిత్ కోలియా అనే యువకుడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్ లోని సహారాపూర్ మత ఘర్షణలకు సంబంధించిన ఫొటోలని అధికారులు వెల్లడించారు. 
 
ఓ భూమి వివాదంలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, పలువురు గాయపడ్డారు. ఈ ఫేస్ బుక్ పోస్ట్ లపై ఓ వర్గానికి చెందిన కొందరు ఆగ్రహం వ్యక్తం చేసి..ఫేస్ బుక్ నుంచి తొలగించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐపీ అడ్రస్ ను కనుగొని యువకుడిని అరెస్ట్ చేశామని మీడియాకు పోలీసులు వివరించారు. 
 
మరిన్ని వార్తలు