వైరల్‌ వీడియో.. పోలీసులపై చర్యలు

19 May, 2020 16:47 IST|Sakshi

లక్నో: కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతోంది. ఈ క్రమంలో ప్రజలు అనవసరంగా బయటకు రాకుడదని.. వచ్చినా మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలని ప్రభుత్వాలు ఆదేశిస్తున్నాయి. కానీ కొందరు మాత్రం ఈ ఆదేశాలను ఏ మాత్రం లెక్క చేయకుండా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి వారి పట్ల పోలీసులు కూడా సీరియస్‌గానే స్పందిస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన  ఒకటి ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో చోటు చేసుకుంది. మాస్క్‌ లేకుండా రోడ్డు మీదకు వచ్చిన ఇద్దరు యువకులను పోలీసులు కఠినంగా శిక్షించారు. మండుటెండలో నడి రోడ్డు మీద వారి చేత పొర్లు దండాలు పెట్టించారు. అది కూడా రైల్వే క్రాసింగ్‌కు సమీపంలోని రోడ్డు మీద సదరు యువకుల చేత ఇలా పొర్లు దండాలు పెట్టించారు. యువకులు మధ్యలో ఆగితే పోలీసులు లాఠీలకు పని చెప్పారు.(ఎందుకు రిస్క్‌? వేస్కోండి మాస్క్‌) 

అయితే ఎవరో ఈ సంఘటనను వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టడమే కాక ట్విట్టర్‌లో యూపీ పోలీసులను ట్యాగ్‌ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజనులు కొందరు యువకుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. మరి కొందరు పోలీసుల తీరును తప్పు పడుతున్నారు. విషయం పెద్దది కావడంతో యూపీ పోలీసు ఉన్నతాధికారుల దీనిపై విచారణ చేపట్టారు. ఇద్దరు పోలీసు అధికారులను సస్పెండ్‌ చేశారు. (వైరైటీ డిజైన్లతో వెండి మాస్క్‌లు)

మరిన్ని వార్తలు