పెళ్లి ఊరేగింపులో అమర జవాన్లకు ఘన నివాళి

18 Feb, 2019 11:31 IST|Sakshi

వడోదరా: పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు దేశ ప్రజలు ఘనంగా నివాళులు ఆర్పిస్తున్న సంగతి తెలిసిందే. గుజరాత్‌లోని వడోదరాకు చెందిన నూతన వధూవరులు కూడా పుల్వామా ఉగ్రదాడిపై తమలో ఉన్న ఆవేదనను చాటిచెప్పారు. అందులో భాగంగా తమ పెళ్లి ఊరేగింపు వేడుకలో అమరులైన సైనికులకు ఘన నివాళులర్పించారు. 

వివాహనికి ముందు జరిగిన పెళ్లి ఊరేగింపులో భాగంగా గుర్రపు రథంలో కూర్చున్న వధూవరులు జాతీయ జెండాతో పాటు.. ఓ ఫ్లకార్డును ప్రదర్శించారు.  దేశంలో కేవలం 1427 పులులు మాత్రమే ఉన్నాయని ఎవరు అన్నారు.. సరిహద్దులో ఉన్న 13 లక్షల పులులు దేశానికి రక్షణ కల్పిస్తున్నాయనే సందేశాన్ని అందులో ఉంచారు. వధూవరులు మాత్రమే కాకుండా ఆ వివాహ వేడుకకు హాజరైన ప్రతి ఒక్కరు జాతీయ జెండాను చేతబూని అమర జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు. పాకిస్తాన్‌కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్రసంస్థ గత గురువారం జరిపిన ఆత్మహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. 

>
మరిన్ని వార్తలు