శ్రీలంక అధ్యక్షుడికి వ్యతిరేకంగా వైకో నిరసన

27 May, 2014 02:48 IST|Sakshi

న్యూఢిల్లీ: మోడీ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్సకు నిరసన తెలిపేందుకు యత్నించిన ఎండీఎంకే చీఫ్ వైకోను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఆయన పార్టీకి చెందిన దాదాపు వంద మంది కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు ఇక్కడి పార్లమెంట్ స్ట్రీట్‌లోకి వచ్చిన ఎండీఎంకే కార్యకర్తలు శ్రీలంక జాతీయ జెండాతో పాటు రాజపక్స ఫొటోలతో కూడిన బ్యానర్లను తగులబెట్టారు.

ఎన్డీయే భాగస్వామిగా ఉన్న ఎండీఎంకే.. రాజపక్సకు ఆహ్వానం పలకడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీలంకలో తమిళుల హక్కులను అధ్యక్షుడు కాలరాశాడని వైకో ధ్వజమెత్తారు. రాజపక్స హాజరవడం వల్ల మోడీ ప్రమాణ స్వీకారోత్సవం పవిత్రత దెబ్బతింటుందని ఆయన వ్యాఖ్యానించారు. శ్రీలంక విషయంలో యూపీఏ బాటలో ఎన్డీయే సాగవద్దని సూచించారు.    
 
 

మరిన్ని వార్తలు