గొర్రెలతో చైనాకు గుణపాఠం చెప్పిన వాజపేయి

26 Jun, 2020 16:52 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇరుగుపొరుగుతో గిల్లికజ్జాలు పెట్టుకోవడం చైనాకు షరామామూలే అనే సంగతి చెప్పడానికి ఇదో చక్కని ఉదాహరణ. అది 1965. ఇండో సినో యుద్ధం తర్వాత పరిస్థితులు ఇంకా గంభీరంగానే ఉన్నాయి. డ్రాగన్ పదే పదే ఇండియాపై అక్కసు వెళ్లగక్కతూనే ఉంది. ఓ వైపు సంప్రదింపులంటూనే భారత జవాన్లు చైనాలోకి చొరబడ్డారని పేర్కొంది. (అమ్మ‌కానికి చే గువేరా ఇల్లు)

సిక్కిం సరిహద్దు దాటి తమ దేశానికి చెందిన వ్యక్తుల నుంచి 800 గొర్రెలు, 59 జడల బర్రెలను భారత సైన్యం దొంగిలించిందని ఆరోపించింది. ఇది సాకుగా చూపి మళ్లీ సైనిక చర్యకు దిగాలనేది డ్రాగన్ ఆలోచన. చైనా ఆరోపణను భారత్ కొట్టిపారేసింది. ఇరువర్గాల మధ్య కొన్నాళ్ల పాటు ఈ సమస్యపై లేఖల యుద్ధం జరిగింది.

తమ గొర్రెలను, బర్రెలను తిరిగివ్వాలని లేకపోతే పరిస్థితులు దారుణంగా మారతాయని భారత్ ను డ్రాగన్ హెచ్చరించింది. చైనా కుటిల నీతిని అర్థం చేసుకున్న అప్పటి యువ ఎంపీ అటల్ బిహారీ వాజ్​పేయి వినూత్న రీతిలో చైనాకు బుద్ధి చెప్పారు. (233 ఏళ్ల ఎంసీసీ చరిత్రలో..)

దాదాపు ఎనిమిది వందల గొర్రెలను ఢిల్లీలోని చైనా ఎంబసీకి తోలుకెళ్లారు. వాటి మెడలో ‘మమ్మల్ని తినండి. కానీ, ప్రపంచాన్ని కాపాడండి’ అనే ప్లకార్డులు వేశారు. గొర్రెలు, బర్రెల పేరుతో ప్రపంచయుద్ధానికి చైనా తెరలేపుతోందని విమర్శించారు.

వాజ్​పేయి గొర్రెల నిరసనకు చైనా విస్తుపోయింది. తమ దేశంలో ఉన్న భారత రాయబార కార్యాలయానికి ఘాటైన లేఖను పంపింది. గొర్రెల ఘటన వెనుక భారత ప్రభుత్వం ఉందని ఆరోపించింది. ఇందుకు తిరిగి లేఖ రాసిన భారత్.. అందులో నిర్మలమైన పదజాలాన్ని వాడుతూ ‘ఢిల్లీ వాసులు కొందరు 800 గొర్రెలను చైనా ఎంబసీలోకి తోలారు. ఇది ఊహించని విధంగా జరిగిన పరిణామం. నిరసన కూడా ప్రశాంతంగా జరిగింది’ అంటూ జవాబిచ్చింది.

మరిన్ని వార్తలు