ఒడిశా పిటిషన్‌ను తోసిపుచ్చిన ట్రిబ్యునల్‌

23 Sep, 2019 13:22 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ : వంశధార ట్రిబ్యునల్‌ ఆంధ్రప్రదేశ్‌కు అనుకూలంగా తీర్పును వెలువరించింది. శ్రీకాకుళం జిల్లా నేరడి బ్యారేజీకి సంబంధించి ఒడిశా ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను వంశధార ట్రిబ్యునల్‌ సోమవారం తోసిపుచ్చింది. గతంలో నేరడి బ్యారేజీకి సంబంధించి 106 ఎకరాల్లో ప్రహారీ గోడ కట్టడానికి జాయింట్‌ సర్వేకు వంశధార ట్రిబ్యునల్‌ అనుమతించిన విషయం తెలిసిందే. అయితే ఆ ఆర్డర్‌లో మార్పలు చేయాలని ఒడిశా ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను ట్రిబ్యునల్‌ తోసిపుచ్చింది. 106 ఎకరాలకు జాయింట్‌ సర్వే నిర్వహించి పూర్తి మ్యాప్‌ను సిద్ధం చేయాలని, సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ మార్గదర్శకత్వంపై నివేధిక చేయాలని ట్రిబ్యునల్‌ ఆదేశాలు జారీ చేసింది. బ్యారేజ్‌కు సంబంధించిన పూర్తి ప్రక్రియను డిసెంబర్‌ 30లోగా పూర్తి చేయాలని ఒడిశా, ఏపీ రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే రెండు వారాల పాటు తీర్పును నిలుపుదల చేయాలని ఒడిశా విజ్ఞప్తిని కూడా ట్రిబ్యునల్‌ తిరస్కరించి తదుపరి విచారణను జనవరి 10వ తేదికి వాయిదా వేసింది.   

మరిన్ని వార్తలు