సంచలన వ్యాఖ్యలు చేసిన వీరప్ప మొయిలీ

8 Jun, 2019 15:51 IST|Sakshi

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధ పడటం.. సీనియర్‌ నాయకులు అందుకు అంగీకరించకపోవటం వంటి విషయాలు తెలిసిందే.  కాగా కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలి రాహుల్ గాంధీ రాజీనామాను అంగీకరించారు. అయితే దానికి ఒక షరతు పెట్టారు. రాహుల్‌ స్థానంలో సమర్థుడైన ఓ కొత్త వ్యక్తిని నియమించిన తర్వాతనే ఆయన రాజీనామా చేయాలని వీరప్ప మొయిలి సూచించారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాహుల్ ఆలోచించేది సరైందే. అయితే ఆయన వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటే వెళ్లొచ్చు. అయితే పార్టీకి నూతన సారథిని వెతికి పెట్టిన తర్వాతే ఆయన ఆ పని చేయాలి. ప్రస్తుతం పార్టీ సంక్షోభ స్థితిలో ఉంది. ఈ స్థితిని నుంచి పార్టీని గట్టెంచిగలిగేది రాహుల్‌ మాత్రమే. ఆయన నాయకత్వ లక్షణాల మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడంటే కేవలం పార్టీ బాధ్యతలు మాత్రమే కావు. జాతీయ స్థాయి బాధ్యతల విషయం. అలాంటి బాధ్యతను సరైన వ్యక్తి చేతిలో పెట్టాకే రాహుల్ రాజీనామా చేయాలి’ అని మొయిలి అన్నారు.

>
మరిన్ని వార్తలు