కరోనా నిబంధనలు పాటిస్తూ పార్లమెంట్‌కు

12 Jul, 2020 05:47 IST|Sakshi

న్యూఢిల్లీ:    పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఉభయసభల సెక్రెటరీ జనరల్స్‌ అధికారులను ఆదేశించారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు పాటిస్తూ ఈ సమావేశాల్లో ఎంపీలు స్వయంగా పాల్గొనే అవకాశం ఉందని చెప్పారు. లోక్‌సభ, రాజ్యసభ సమావేశాలు పార్లమెంట్‌ ప్రాంగణంలోని ఆయా సభల్లోనే జరిగే వీలుందని వెల్లడించారు. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్‌ ఎం.వెంకయ్య నాయుడు శనివారం సమావేశమయ్యారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలను ఎలా నిర్వహించాలన్న దానిపై చర్చించారు. అయితే, ఈ సమావేశాలను ఎప్పటి నుంచి ఎప్పటిదాకా నిర్వహించాలో ఇంకా తేదీలు నిర్ణయించలేదు. వాస్తవానికి సెప్టెంబర్‌ 22వ తేదీలోగా ప్రారంభించాల్సి ఉంది.

మరిన్ని వార్తలు