సతీష్‌ గుజ్రాల్‌ కన్నుమూత..

27 Mar, 2020 15:58 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ కళాకారుడు, ఆర్కిటెక్ట్‌, పద్మవిభూషణ్‌ అవార్డు గ్రహీత సతీష్‌ గుజ్రాల్‌ మరణించారు. సతీష్‌ గుజ్రాల్‌ మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్‌కు సోదరుడు. దేశ విభజనకు ముందు 1925, డిసెంబర్‌ 25న జన్మించిన సతీష్‌ గుజ్రాల్‌ లాహోర్‌, ముంబైల్లో విద్యాభ్యాసం సాగించారు. నటనతో పాటు ఆర్కిటెక్చర్‌లోనూ విశేష ప్రాచుర్యం పొందిన గుజ్రాల్‌ ఢిల్లీలో బెల్జియం రాయబార కార్యాలయ భవనం డిజైన్‌ను రూపొందించారు. గుజ్రాల్‌ విశేష ప్రతిభా పాటవాలు కలిగిన వారని, ఆయనలోని సృజనాత్మకత తనను ఆకట్టుకునేదని, గుజ్రాల్‌ మరణం విచారకరమని ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. నటుడు, ఆర్కిటెక్ట్‌ గుజ్రాల్‌ మరణం దేశానికి తీరని లోటని, ఆయన సేవలను దేశం ఎన్నడూ గుర్తుంచుకుంటుందని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు సంతాపం వ్యక్తం చేశారు.

చదవండి : ‘పద్మ’కు తాకిన కరోనా భయాలు!

మరిన్ని వార్తలు