స్మితా తల్వాల్కర్ ఇకలేరు

6 Aug, 2014 23:06 IST|Sakshi

ముంబై: మరాఠీ రంగస్థలంపై తనదైన ముద్రవేసిన ప్రముఖ నటి స్మితా తల్వాల్కర్ బుధవారం ఉద యం మృతిచెందారు. ఒవేరియన్ క్యాన్సర్‌తో కొంతకాలంగా బాధపడుతున్న ఆమె ఉదయం 2.30 గంటల ప్రాంతంలో నగరంలోని జస్లోక్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. సమస్యను ముందుగానే గుర్తించకపోవడంతో చివరిదశలో ఆస్పత్రికి తీసుకొచ్చారని, బతికించేందుకు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని ఆస్పత్రివర్గాలు వెల్లడిం చాయి.

స్మితా మరణం మరాఠీ చిత్ర పరిశ్రమకు తీరని లోటని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ, సమాచార ప్రచారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఓ ప్రకటనలో తెలిపారు. బుల్లితెరపై న్యూస్ రీడర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన స్మితా రంగస్థలంపైనే కాకుండా అనేక మరాఠీ చిత్రాల్లో కూడా నటించి జాతీయ అవార్డునుసైతం సాధిం చారు. ‘తూ సౌభాగ్యవతీ హో’, ‘గడ్‌బాద్ ఘోటా లా’ వంటి చిత్రాల్లో ఆమె నటన విమర్శల ప్రశంసలందుకుఉంది.

మరిన్ని వార్తలు