రామమందిరంపై వీహెచ్పీ కొత్త ప్రకటన

6 Sep, 2016 16:03 IST|Sakshi
రామమందిరంపై వీహెచ్పీ కొత్త ప్రకటన

పాట్నా: వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విశ్వహిందూపరిషత్ (వీహెచ్పీ)నేత ప్రవీణ్ తొగాడియా భారీ ప్రభావం పడే ప్రకటన చేశారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సంబంధించి వీహెచ్పీ ఎలాంటి ఆందోళన కార్యక్రమం ప్రస్తుతం చేయాలని అనుకోవడం లేదని అన్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు వరకు తాము అలాంటి ప్రతిపాదనతో ఏ కార్యక్రమం చేయాలని అనుకోవడం లేదని చెప్పారు.

అయితే, రామ మందిరం నిర్మాణం విషయంలో వీహెచ్పీ కట్టుబడి ఉందని అన్నారు. 'అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరుగుతుంది. ఇది రూఢి అయిన వాస్తవం' అని ఆయన మంగళవారం పాట్నాలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ  చెప్పారు. అదే సమయంలో బిహార్లో మద్యం నిషేధాన్ని అమలు జరుపుతుండటంపై ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వ నిర్ణయానికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. కాగా, రామమందిరం అంశాన్ని ఇప్పుడు తెరమీదకు తీసుకొస్తే ముస్లిం ఓటర్లు దూరమయ్యే ప్రమాదం ఉందని బీజేపీ భావిస్తున్న నేపథ్యంలోనే తొగాడియా ఇప్పటికిప్పుడు ఈ ప్రకటన చేసినట్లుందని పలువురు రాజకీయ మేథావులు అంటున్నారు.

మరిన్ని వార్తలు