‘పొరుగు’ కుట్రలను సహించరాదు 

16 Feb, 2019 03:16 IST|Sakshi
శుక్రవారం ఢిల్లీలో సెలెక్టెడ్‌ స్పీచెస్‌ వాల్యూమ్‌–1 పుస్తకాన్ని విడుదల చేస్తున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు 

ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు 

సాక్షి, న్యూఢిల్లీ: ఉగ్రదాడులతో భారతదేశాన్ని అస్థిర పరిచేందుకు పొరుగు దేశం చేస్తున్న కుట్రలను సహించరాదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉద్ఘాటించారు. పొరుగు దేశం ఉగ్రవాదులకు సహకరించి నిధులు సమకూర్చ డం దురదృష్టకరమని అంటూ ఆయన.. వీటన్నింటినీ తట్టుకుని నిలబడి మాతృదేశాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా మార్చుకునేందుకు ప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఉపరాష్ట్రపతి ప్రసంగాల సంకలనం ‘సెలెక్టెడ్‌ స్పీచెస్‌ వాల్యూమ్‌–1’ను ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో శుక్రవారం మాజీ రాష్ట్ర పతి ప్రణబ్‌ ముఖర్జీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంక య్య మాట్లాడుతూ.. త్వరలో జరగనున్న ఎన్నికల్లో క్యారెక్టర్‌ (గుణం), కెపాసిటీ (సామర్థ్యం), క్యాలిబర్‌ (యోగ్యత), కండక్ట్‌ (నడత) కలిగిన వ్యక్తులను ఎన్నుకోవాలని, అలాంటి వారినే ప్రజాప్రతినిధులుగా చూడాలనుకుంటున్నా నని అన్నారు.

ప్రస్తుతం చట్టసభలు సాగుతున్న తీరుపై ఆందోళన వ్యక్తం చేసి న ఆయన.. ప్రజాస్వామ్య దేవాలయాల్లో ప్రజల గొంతు ప్రతిధ్వనించాలని సూచించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మాట్లాడుతూ.. భారతీయతను ప్రతిబింబించే ప్రసంగాలు చేసే వెంకయ్యకు తాను అభిమానినన్నారు. ఈ పుస్తకంలో స్ఫూర్తిదాయక అంశాలే గాక, మదిలో కలకాలం నిలిచి పోయే జ్ఞా పకాల సమాహారం కూడా ఉందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్, థావర్‌ చంద్‌ గెహ్లాట్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు