మాల్యా అప్పగింత : మరో ఎత్తుగడ

10 Jun, 2020 08:39 IST|Sakshi

 విజయ్ మాల్యా అప్పగింతలో మరో న్యాయపరమైన  చిక్కు

మానవతా ప్రాతిపదికన ఆశ్రయం ఇవ్వాలని కోరిన మాల్యా

సాక్షి, న్యూఢిల్లీ: మనీలాండరింగ్ ఆరోపణలతో విచారణను ఎదుర్కొంటున్న ఉద్దేశపూరక ఎగవేతదారుడు విజయ్ మాల్యాను  భారతదేశానికి రప్పించే ప్రయత్నాలు ఇప్పట్లో ఫలించే అవకాశాలు కనిపించడం లేదు. మాల్యా అప్పగింతకు ముందు చట్టపరమైన సమస్య పరిష్కరించాల్సి ఉందంటూ బ్రిటీష్ హైకమిషన్ ఇప్పటికే తేల్చి చెప్పింది. తాజాగా మరో న్యాయపరమైన చిక్కు వచ్చినట్టు సమాచారం. ఇది పరిష్కారం అయ్యేంత వరకు మాల్యాను స్వదేశానికి రప్పించే  ప్రక్రియలో మరికొంత జాప్యం తప్పదు.

మానవతా దృక్పథం ప్రాతిపదికన తనకు లండన్ లో ఆశ్రయం కల్పించాల్సిందిగా మాల్యా కోరినట్టు తెలుస్తోంది. యూరోపియన్ కన్వెన్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ (ఈసీహెచ్ఆర్) ఆర్టికల్ 3 ప్రకారం తాజా పిటిషన్ దాఖలు చేశారు. మాల్యాకు యూకే ఆశ్రయం ఇస్తుందా లేదా అనేది చూడాలి. అయితే ఇలాటి దరఖాస్తులు ప్రాసెస్ కు కనీసం ఆరు నెలలు పడుతుందనీ, ఒకవేళ మాల్యా అభ్యర్ధనను తిరస్కరించి నప్పటికీ,  దీనిపై మళ్లీ రివ్యూ కోరుకునే అవకాశం కూడా వుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాల్యాకు  కొంత సమయం కచ్చితంగా లభిస్తుందని  చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు