విజయ్‌ మాల్యా చివరి అస్త్రం ఇదే..

27 May, 2020 17:15 IST|Sakshi

లండన్‌: బ్యాంకులకు కోట్లాది రూపాయల రుణాల ఎగవేత కేసులో లీగల్‌గా అన్ని దారులు మూసుకుపోవడంతో లిక్కర్‌ దిగ్గజం విజయ్‌ మాల్యా చివరిసారిగా బ్రహ్మాస్త్రం వాడనున్నారు. భార‌త్‌లో 9వేల కోట్ల ఫ్రాడ్, మానీ లాండ‌రింగ్‌కు పాల్ప‌డి విదేశాలకు మాల్యా పారిపోయిన విషయం తెలిసిందే. త‌న‌ను భార‌త్‌కు అప్ప‌గించ‌వ‌ద్దంటూ మాల్యా దాఖ‌లు చేసిన అప్పీల్‌ను ఇటీవలే యూకే హై కోర్టు వేసింది. న్యాయపరంగా అన్ని లోసుగులను వాడుకోవడంతో మాల్యా సరికొత్త అస్త్రాన్ని వాడనున్నారని యూకే న్యాయ వర్గాలు తెలిపాయి. తాజాగా మాల్యా పొలిటికల్‌ అసిలమ్‌(నిర్వాసితులు) అనే అస్త్రాన్ని వాడనున్నారు.  

ఏదయినా వ్యక్తి యూకేలో నిర్వాసితులుగా అర్హత పొందాలంటే వ్యక్తి సొంత దేశంలో కేసులతో గానీ, రాజకీయంగా, సామాజికంగా వేధించే అవకాశాల ఉన్న స్థితిలో నిర్వాసితులుగా తమ దేశంలో భద్రత కల్పిస్తారు. అయితే, వ్య్తక్తులు నిర్వాసితులుగా అర్హత పొందడానికి కోర్టు సుదీర్ఘంగా విచారిస్తుందని.. దాదాపు రెండు సంవత్సరాలు సమయం పట్టవచ్చని యూకేకు చెందిన సీనియర్‌ న్యాయవాది అభిప్రాయపడ్డారు. ఒకవేళ నిర్వాసితునిగా కూడా అర్హత సాధించకుంటే ట్రిబ్యూనల్‌లో కూడా అప్పీలు చేసుకోవచ్చని నిపుణులు తెలిపారు. భారత్‌లో విచారణను తప్పించుకోవడానికి మాల్యా సరికొత్త వ్యూహాన్ని అమలు చేయబోతున్నట్లు న్యాయ నిపుణలు విశ్లేషిస్తున్నారు.

చదవండి: భారత్‌కు మాల్యా.. 28 రోజుల్లో

మరిన్ని వార్తలు