నితిన్కాదు.. విజయ్ ముఖ్యమంత్రి

5 Aug, 2016 18:04 IST|Sakshi
నితిన్కాదు.. విజయ్ ముఖ్యమంత్రి

గాంధీనగర్: అనూహ్యంగా ఖాళీ అయిన గుజరాత్ సీఎం పీఠాన్ని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విజయ్ రూపాని అధిష్టించనున్నారు. అంతకుముందు ఈ పదవి దక్కించుకుంటారని ఊహాగానాలు వచ్చిన రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత, ఆనందీ బెన్ పటేల్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన నితిన్ పటేల్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం రాష్ట్ర ఎమ్మెల్యేలతో భేటీ అయిన అమిత్ షా ఈ నిర్ణయాన్ని వెలువరించారు.

విజయ్ రూపాని ఆనందీబెన్ పటేల్ ప్రభుత్వంలో రవాణా మంత్రిగా పనిచేశారు. అంతేకాకుండా రూపానీకి మోదీ, అమిత్ షాతోపాటు ఆరెస్సెస్ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. అన్ని వర్గాలను కలుపుకుపోతారని ఈయనకు పేరుంది. పరిపాలన పరంగా కూడా మంచి పట్టున్న వ్యక్తిగా పేరుంది. ప్రస్తుతం అమిత్ షా అహ్మదాబాద్ లోనే ఉండి పార్టీ ఎమ్మెల్యేలందరితో కాబోయే సీఎంపై వారితో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, నితిన్ భాయ్ పటేల్ ఉత్తర గుజరాత్లో బలమైన నాయకుడని ఆయననే సీఎం పీఠం వరిస్తుందని తొలుత ఊహగానాలు వెలువడ్డాయి.

మరిన్ని వార్తలు