25న విజయన్ ప్రమాణం

22 May, 2016 01:08 IST|Sakshi
25న విజయన్ ప్రమాణం

తిరువనంతపురం: కేరళ సీఎంగా పినరయి విజయన్ ఈ నెల 25న ప్రమాణస్వీకారం చేయనున్నారు.  తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో ఎల్డీఎఫ్ కేబినెట్ ప్రమాణ స్వీకారం చేస్తుందని ఆయన  శనివారం తెలిపారు. ఆదివారం కూటమి పార్టీలు సమావేశమై మంత్రివర్గ కూర్పుపై చ ర్చిస్తాయన్నారు. అనంతరం పార్టీ సీనియర్ నేత వి.అచ్యుతానందన్‌ను ఆయన ఇంట్లో కలసి ప్రమాణస్వీకారంపై చర్చించారు.

ప్రమాణానికి  హాజరుకావాలని కోరారు. నిత్యావసరాల ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని అచ్యుతా నందన్ సూచించారు. కాగా,  ఈ నెల 27న పశ్చిమ బెంగాల్ సీఎంగా మమతా బెనర్జీ ప్రమాణానికి ప్రధాని మోదీతో పాటు పలువురు విదేశీ ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లాయి.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు