అసలు ఆ మొత్తాన్ని దుబే ఏం చేశాడు?

14 Jul, 2020 12:09 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దుబే కేసు విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలు బయటకొస్తున్నాయి. దుబే, నెలకు కోటి రూపాయల వరకు సంపాదించేవాడని ఈడీ వర్గాలు తెలిపారు. అయితే ఆ డబ్బులు ఎలా ఖర్చు చేసేవాడు అనే విషయాల మీద ఈడీ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. దుబే కి తాగే అలవాటు కూడా లేదు. అంతే కాకుండా అతను చాలా సాధారణమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడేవాడు. ఆడంబరమైన దుస్తులను కూడా ధరించేవాడు కాదు. అంతే కాకుండా విదేశీ ప్రయాణాలు కూడా దుబే చేసేవాడు కాదు. ఇలా అన్ని రకాలుగా చూసిన దుబే అంత డబ్బును ఖర్చు చేయలేడు. మరి ఆ డబ్బంతా ఏమైనట్టు అనే కోణంలో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది.

చదవండి: వికాస్‌ దుబే వెనుకున్న వారెవరు?

దుబే, బ్యాంక్‌ ఖాతాలో కూడా ఎక్కడ ఎక్కువ డబ్బు ఉన్నట్లు తెలియలేదు. దుబే బ్యాంక్ ఖాతాతో పాటు ఆయన సన్నిహితుల బ్యాంక్‌ ఖాతాలను కూడా ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు. దీంతో పాటు దుబే ఆ డబ్బుతో ఏమైనా బిజినెస్‌ చేశారా అనే కోణంలో కూడా ఆయనకు సన్నిహితంగా ఉండే బిజినెస్‌మ్యాన్‌లను కూడా ఆరా తీస్తున్నారు. ప్రతి నెల 90 లక్షల నుంచి 1.2 కోట్ల వరకు సంపాదించే దుబే, ఆ డబ్బును ఏం చేస్తున్నారో తెలియాలంటే ఈడీ విచారణ పూర్తవ్వాల్సిందే.  కాన్పూర్‌లో 8 మంది పోలీసులను చంపిన  కేసుతో పాటు అనేక కిడ్నాప్‌లు, మర్డర్‌ల కేసులో కూడా దుబే నిందితుడు. దుబేను జూలై 10వ తేదీన ఉత్తరప్రదేశ్‌ పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసిన సంగతి తెలిసిందే.  

చదవండి: రిపోర్టర్లపై దుబే భార్య ఆగ్రహం

మరిన్ని వార్తలు