పెళ్లి కోసం గ్రామమంతా బ్యాంకు ముందే

23 Nov, 2016 11:09 IST|Sakshi
పెళ్లి కోసం గ్రామమంతా బ్యాంకు ముందే

కోలాపూర్: పెద్ద నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు ఎంత సతమతమవుతున్నారో పెద్దగా చెప్పనక్కర్లేదు. ఇక వివాహం, పండుగల్లాంటి కార్యక్రమాలయితే కళ తప్పాయి. ఎక్కడి పెళ్లిళ్లు అక్కడ ఆగిపోయాయి. కానీ కోలాపూర్లో మాత్రం డబ్బుల కష్టాల్లోనూ ఓ పెళ్లిని జరిపేందుకు ఆ గ్రామస్తులు నడుంకట్టారు. ఏకతాటిపై నిలబడి ఆ పెళ్లికి సర్వం సిద్ధం చేశారు. కోలాపూర్ అనే అమ్మాయి బీఏ బీఈడీ చదవిన విద్యార్థిని. ఆ యువతికి ఓ షాపు యజమానికి వివాహం కుదిరింది.

మూడు నెలల కిందటే ఈ నిర్ణయం జరిగింది. అయితే, అనూహ్యంగా కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేసింది. దీంతో బ్యాంకుల్లో ఉన్న తమ డబ్బును ఒకేసారి తీసుకోలేని పరిస్థితి. ఈరోజు(బుధవారం) పెళ్లి చేయాల్సిన అవసరం ఉంది. దీంతో ఈ విషయం తెలిసి గ్రామస్తులంతా కలిసి బ్యాంకుల ముందు బారులు తీరారు. ఆమె పెళ్లి కోసం తలా కొంచెం డబ్బు డ్రా చేసి సిద్ధం చేశారు. తమకు తోచినమేరకు బహుమతులు కూడా సిద్ధం చేశారు. దీంతో అనుకున్న ప్రకారం పెళ్లి జరుగుతోంది. దీంతో తన పెళ్లి వల్ల గ్రామస్తులంతా మరోసారి ఒక్కటయ్యారని, మా కుటుంబాని వారంతా స్నేహితులుగా మారారని సయాలి సంతోషాన్ని వ్యక్తం చేసింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు