గ్రామ పంచాయితీ వివాదాస్పద నిర్ణయం

22 Dec, 2017 13:41 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఛత్తీస్‌గఢ్‌లో ఓ గ్రామ పంచాయితీ జారీ చేసిన ఆదేశాలు కాస్త విడ్డూరంగానూ.. చర్చనీయాంశంగానూ మారాయి. టాయ్‌లెట్లలో పిల్లల ఫోటోలను తీసి వాటిని వాట్సాప్‌ గ్రూప్‌లలో వైరల్ చేయాలని పంచాయితీ పెద్దలు స్కూళ్ల యాజమాన్యాలను ఆదేశించారు.

ధామటారి జిల్లాలోని ఓ గ్రామ పంచాయితీ అధికారులు ఈ ఆదేశాలను జారీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూళ్లను కలుపుకుని సుమారు 355 పాఠశాలలకు ఈ ఉత్తర్వులు అందాయంట. స్వచ్ఛ భారత్‌ మిషన్‌ లో భాగంగా ఆయా స్కూళ్లలో టాయ్‌ లెట్ల నిర్మాణాలను చేపట్టగా.. వాటి పనితీరు... పిల్లలు వాటిని సరిగ్గా వినియోగిస్తున్నారా? లేదా? శుభ్రత తదితర విషయాలపై స్పష్టత కోసమే ఈ ఆదేశాలను ఇచ్చినట్లు పంచాయితీ పెద్దలు చెబుతున్నారు. 

ఈ ఆదేశాలకు వ్యతిరేకంగా స్కూళ్ల యాజమాన్యాలు ఆందోళన చేపట్టేందుకు సిద్ధమైపోయాయి. ఇది ముమ్మాటికీ పిల్లల హక్కులను భంగం కలిగించటం అవుతుందని.. పైగా స్కూల్ సిబ్బంది కూడా ఈ ఆదేశాలను ఇబ్బందిగా భావిస్తున్నారని టీచర్లు చెబుతున్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా