సీఏఏపై ఆగని ఘర్షణలు..

25 Feb, 2020 15:54 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి.  ఢిల్లీలోని మౌజ్‌పూర్‌, బాబర్పూర్‌, గోకుల్‌పురి తదితర ప్రాంతాల్లో తాజాగా అల్ల్రర్లు చెలరేగడంతో ఆయా ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఘర్షణల్లో ఇప్పటివరకూ హెడ్‌ కానిస్టేబుల్‌ సహా ఏడుగురు మరణంచారు. కాగా, ఘర్షణల నేపథ్యంలో ఈశాన్య ఢిల్లీలోని పది ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్‌ విధించారు. సమస్యాత్మక  ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. హింస చెలరేగిన క్రమంలో 35 కంపెనీల పారామిలటరీ బలగాలతో పాటు స్పెషల్‌ సెల్‌, క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు సహా ఆర్థిక నేరాల విభాగం అధికారులు సైతం రంగంలోకి దిగారు. ఢిల్లీ పరిసర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను రప్పించి ఈశాన్య ఢిల్లీలో మోహరించారు. కాగా హింసాకాండలో మరణించిన ఇద్దరు పౌరులను షాహిద్‌, పుర్ఖాన్‌లుగా గుర్తించారు. ఘర్షణలల్లో పది మంది పోలీసులు గాయపడగా, పోలీస్‌ హెడ్‌కానిస్టేబుల్‌ రతన్‌ లాల్‌ ప్రాణాలు కోల్పోయారు.

చదవండి : ‘వెనక్కి వెళ్లిపో లేదంటే.. కాల్చిపడేస్తా!’

మరిన్ని వార్తలు