లగ్జరీ బైక్‌పై చీఫ్‌ జస్టిస్‌; ఫోటోలు వైరల్‌

29 Jun, 2020 09:35 IST|Sakshi

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శరద్‌ అరవింద్ బాబ్డేబైక్‌పై చక్కర్లు కొడుతున్నారు. నాగ్‌పూర్‌లో లగ్జరీ బైక్‌ హార్లే డెవిడ్సన్‌పై రయ్‌ రయ్‌ అంటూ షికారు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎప్పుడూ కేసులు, తీర్పులు అంటూ బిజీగా ఉండే చీఫ్‌ జస్టిస్‌ ఇలా కనిపించడంతో నెటిజన్లు తెగ సంబరపడిపోతున్నారు. ‘ఎంత కూల్‌గా ఉన్నారు మై లార్డ్‌’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. చీఫ్‌ జస్టిస్‌ మాస్క్‌ పెట్టుకోకపోవడాన్ని కొంతమంది ఆక్షేపించారు. ‘సార్.. హార్లే డేవిడ్సన్‌పై అడుగు పెట్టారు. వేగవంతమైన న్యాయం కోసమేనని ఆశిస్తున్నాం’ అంటూ పలువురు వ్యాఖ్యానించారు. కాగా, ఎస్‌ఏ బాబ్డేకు బైకులు నడపడం చాలా ఇష్టమని ఇంతకు ముందు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తన వద్ద ఓ బుల్లెట్‌ బైక్‌ కూడా ఉందని పేర్కొన్నారు. (‘ప్రధాని ప్రశంసించారు.. అది చాలు’)

కాగా శరద్‌ అరవింద్‌ నవంబర్‌ 18, 2019న సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తన కెరీర్‌లో ఎన్నో కీలకమైన కేసుల్లో ఆయన పనిచేశారు. వివాదాస్పద అయోధ్య భూవివాదం కేసులో నవంబర్‌ 9,2019 నాటి తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు అయిదురుగు రాజ్యాంగ ధర్మాసనంలో అరవింద్‌ బాబ్డే ఒకరు. మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గోగోయి నేతృత్వం వహించిన ఇందులో జస్టిస్‌లు శరద్‌ అరవింద్‌ బాబ్డే, అశోక్‌ భూషణ్‌, డీవై చంద్రచూడ్‌, ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌ సభ్యులుగా ఉన్నారు. వీటిలో ఢిల్లీ కాలుష్యం కూడా ఉంది. 2016లో దేశ రాజధాని చుట్టుపక్కలా పటాసుల అమ్మకాలను నిలిపివేస్తూ సుప్రీం తీర్పునిచ్చిన ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్‌లో ఆయన ఒకరు. ఇదిలా ఉండగా 2019లో బైక్‌ను టెస్ట్ రైడింగ్ చేస్తున్నప్పుడు బాబ్డే రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఇది హై-ఎండ్ హార్లే డేవిడ్సన్ బైక్ అని తెలుస్తోంది. అతను బైక్ మీద నుంచి పడటంతో అతని కాలుకు భారీగా దెబ్బ తగిలింది. ఈ ప్రమాదం అతన్ని కోర్టు విధులతో పాటు సుప్రీంకోర్టు కొలీజియం సమావేశాలకు దూరంగా ఉంచింది. (చైనాతో తాడోపేడో: సిలిండర్లు నిల్వ చేసుకోండి )

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా