ఈ చిత్రంలో ఎన్ని పులులు ఉన్నాయి?

24 Apr, 2020 11:06 IST|Sakshi

ఇటీవల సోషల్‌ మీడియాలో ఓ కొత్త గేమ్‌ ట్రెండ్‌ అవుతోంది. ఒక ఫోటోను షేర్‌ చేసి అందులో ఎన్ని జంతువులు ఉన్నాయో కనుక్కోవాలంటూ సవాల్‌ విసురుతున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలంతా ఇంట్లోనే ఉండటంతో ఇలాంటి గేమ్‌లపై ఆసక్తి కనబరుస్తున్నారు. మొదడుకు కొంచెం పని పెట్టి వాటిని వెతికి పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా అలాంటి ఓ ఛాలెంజ్‌ మళ్లీ నెటిజన్ల ముందు చక్కర్లు కొడుతోంది. ఒక ఫ్రేమ్‌లో కొన్ని పులులకు సంబంధించిన ఫోటోను ట్విటర్‌లో షేర్‌ చేస్తూ చిత్రంలో ఎన్ని పులులు ఉన్నాయో కనుక్కోవాలని ఓ నెటిజన్‌ ప్రశ్నించాడు. బుధవారం పోస్ట్‌ చేసిన ఈఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. (కరోనా: కేరళలో నాలుగు నెలల చిన్నారి మృతి )

‘ఈ చిత్రంలో మీకు ఎన్ని పులులు కనిపిస్తున్నాయి’ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ ఫోటోపై అనేక మంది తమ సమాధానాలను తెలుపుతున్నారు. అయితే బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ఈ ఫోటోపై స్పందించడం విశేషం.ఈ  చిత్రంలో 11 పులులు ఉన్నాయని బిగ్‌బీ సమాధానమిచ్చారు. కాగా హీరోయిన్‌ దియా మిర్జా కూడా పులుల చిత్రంపై స్పందించి, చిత్రంలో 16 పులులు ఉన్నాయని పేర్కొన్నారు. ఇక వీరితో కొంతమంది ఏకీభవించి 16 ఉన్నాయని తెలపగా మిగతా వారు 20 పులుల వరకు ఉన్నాయంటూ చెబుతున్నారు. మరి మీకు ఫోటోలో ఎన్ని పులులు కనిపిస్తున్నాయో కౌంట్‌ చేయండి. (ఈ వింత జీవి పేరేంటో మీకు తెలుసా? )

వైరల్‌: ఈ ఫోటోలో పాము ఎక్కడుందో కనిపించిందా!

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా