వైరల్‌: వెంట్రుకవాసిలో బతికి బయటపడ్డారు..

17 Feb, 2020 08:14 IST|Sakshi
ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికులు (ఫొటో కర్టసీ: హిందుస్తాన్‌ టైమ్స్‌)

భువనేశ్వర్‌: ఓ మహిళా ప్రయాణికురాలిని ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ కాపాడిన ఘటన శనివారం ఒడిశాలో చోటు చేసుకుంది. భువనేశ్వర్‌ రైల్వే స్టేషన్‌లో ఓ మహిళా ప్రయాణికురాలు కదులుతున్న రైలు ఎక్కబోయింది. అప్పటికే జనం నిండుగా ఉండటంతో ఆమెకు రైలు ఎక్కడం వీలుకాకపోగా రైలుకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్యలో ఉన్న గ్యాప్‌లో ఆమె పడబోయింది. ఇది గమనించిన ఓ ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ వెంటనే పరిగెత్తుకొచ్చి ఆమెను బయటకు పట్టుకుని బయటకు లాగాడు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పిందని అక్కడి జనాలు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారగా.. ప్రయాణికురాలు చేసిన పనికి నెటిజన్లు చీవాట్లు పెడుతున్నారు. ‘కొంచెం కూడా చూసుకోనక్కర్లేదా.. అక్కడ ఎవరూ లేకపోయుంటే ఆమె పరిస్థితి ఏమయ్యేదో ఊహించడానికే భయంకరంగా ఉంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. (‘పుల్వామా’పై రాజకీయ దాడి)

మరోవైపు కానిస్టేబుల్‌ చూపిన చొరవకు జేజేలు పలుకుతున్నారు. ‘మహిళ ప్రాణాలను కాపాడిన రియల్‌ హీరో’ అంటూ ఆకాశానికి ఎత్తుతున్నారు. ఇక సుమారు ఇలాంటి ఘటనే ముంబైలోని బైసుల్లా రైల్వే స్టేషన్‌లోనూ జరిగింది. ఓ వ్యక్తి రైల్వే ట్రాక్‌ను దాటడానికి ప్రయత్నిస్తుండగా అదే సమయంలో ఎదురుగా రైలు వచ్చింది. ఇది గమనించిన తోటి ప్రయాణికులు ఆయనను ప్లాట్‌ఫామ్‌ మీదకు లాగారు. దీంతో అప్రమత్తమైన మోటార్‌మెన్‌ సైతం రైలును కూతవేటు దూరంలో ఆపేశాడు. ఇక ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ సదరు వ్యక్తి భాద్యతారాహిత్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ రెండు ఘటనలు ఫిబ్రవరి 15నే జరగడం గమనార్హం.(బీచ్‌లో బికినీ వేసుకుందని)

(క్షణాల్లో కాపాడారు.. తృటిలో బయటపడ్డాడు)

మరిన్ని వార్తలు