ప్రేమ‌ప‌క్షులు..ఇప్పుడు ఇంట్లోనే ఆనందంగా

2 Apr, 2020 20:48 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ:  ఏ కాస్తా స‌మ‌యం దొరికినా విదేశాల‌కు వాలిపోతుంటారు విరాట్‌, అనుష్క‌ల జంట‌. దేశ‌వ్యాప్త లాక్‌డౌన్ నేప‌థ్యంలో  అటు సినిమా షూటింగులు, ఇటు అంత‌ర్జాతీయ‌క్రికెట్ మ్యాచ్‌లు వాయిదాప‌డ్డాయి. దీంతో ఈ ప్రేమ‌ప‌క్షులు ఇప్ప‌డు ఇంట్లోనే ఆనందంగా స‌మ‌యం గ‌డుపుతున్నారు. అంతేనా..క‌రోనా మ‌హమ్మారిపై అవ‌గాహ‌న క‌ల్పిస్తూ ఎప్ప‌టిక‌ప్పుడు వీడియోలు పోస్ట్ చేస్తుంటారు.  రీసెంట్‌గా అనుష్కతో ఉన్న ఓ ఫోటోను షేర్ చేస్తూ..మా న‌వ్వులు అబ‌ద్ద‌మేమా కానీ మేము కాదు. ఇంట్లోనే ఉండండి. ఆరోగ్యంగా ఉండండి. అని విరాట్ చెప్పుకొచ్చాడు.

అంతేకాకుండా ఈ విప‌త్క‌ర స‌మ‌యంలో బాధ్య‌త గ‌త పౌరులుగా త‌మ వంతు సాయాన్ని పిఎం కేర్స్, మ‌హారాష్ర్ట సీఎం  స‌హాయ‌నిధికి విరాళాలు ఇచ్చారు. ఇక దేశంలో ఒక్క‌సారిగా తీవ్ర‌రూపం దాలుస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా 60కి పైగా మ‌ర‌ణాలు సంభంవించ‌గా, రెండు వేల‌కిపైగా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు