ముంబై ఘటనపై క్రికెటర్ల దిగ్భ్రాంతి

30 Sep, 2017 14:48 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో జరిగిన విషాద ఘటనపై భారత క్రికెటర్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గురువారం ఎల్ఫిన్‌స్టన్‌ రోడ్, పరేల్‌ సబర్బన్‌ రైల్వే స్టేషన్లను కలిపే ఓ ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిపై జరిగిన తొక్కిసలాటలో 22 మంది మరణించగా మరో 30 మందికిపైగా తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ట్విట్టర్‌లో స్పందించిన టీమిండియా మాజీ, ప్రస్తుత క్రికెటర్లు మరణించిన అమయాక ప్రజలకు నివాళులు అర్పించారు. 

‘మానవ జీవితం చౌకబారు ఘటనలతో అంతమవుతోంది. పన్నులు చెల్లించినా ప్రభుత్వాల అలసత్వంతో అమాయక ప్రజలు మరణిస్తున్నారు. నగరాల్లో ప్రజలు రిస్క్‌తో ప్రయాణిస్తున్నారు. ప్రజలకు కల్పించాల్సిన భద్రత చాలరోజులుగా కరువైంది.  ఎల్ఫిన్‌స్టన్‌ ప్రమాదం హృదయ విచారక ఘటన.. వారి తప్పులేకున్నా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వారికి నా ఘననివాళులు’  అని సేహ్వాగ్‌ వరుస ట్వీట్‌లతో ఆవేదన వ్యక్తం చేశారు. ముంబై ఘటన వార్త విని గుండె పగిలిందని రోహిత్‌, ఆకస్మిక ఘటన బాధను కలిగించిందని వీవీఎస్‌ లక్ష్మణ్‌ మృతులకు నివాళులర్పిస్తూ ట్వీట్‌ చేశారు. మరో మాజీ క్రికెటర్‌ మహ్మాద్‌ కైఫ్‌ తొక్కిసలాట ఘటన మృతులకు నివాళులర్పిస్తూ క్షతగాత్రులు కోలుకోవాలని ట్వీట్‌ చేశారు.

>
మరిన్ని వార్తలు