సంస్కృతిని మించింది ఏదీ లేదు : సెహ్వాగ్‌

13 Nov, 2017 11:50 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎప్పుడూ ఆలోచింపజేసే ట్వీట్లు చేస్తూ మనం ట్విట్టర్ కింగ్ గా ముద్దుగా పిలుచుకునే మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మరొకసారి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఓ పోస్ట్‌ అందరిని ఆలోచనలో పడేసింది. క్రికెట్కు గుడ్ బై చెప్పిన తరువాత వీరేంద్ర సెహ్వాగ్ ఒకవైపు వ్యాఖ్యాతగా, మరొకవైపు సోషల్‌ మీడియాలో రెగ్యులర్ పోస్టులతో అభిమానులకు టచ్లో ఉంటున్నాడు. దీనిలో భాగంగానే ఓ ఆసక్తికరమై ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.

ప్రపంచం ఓవైపు ఫ్యాషన్‌ రంగంలో దూసుకుపోతోంది. రోజు రోజుకు కొత్త కొత్త మోడల్‌లతో వస్త్రరంగం కొత్త పుంతలు తొక్కుతూనే ఉంది. అయితే మనిషి ప్రయాణం ఎక్కడ ప్రారంభమైందో తెలిపే ఓ సంఘటనకు సంబంధించి ఓ ఫోటోను వీరేంద్రసెహ్వాగ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసి ఓ కామెంట్ పెట్టారు. ప్రపంచంలోనే ఎంతో గుర్తింపు పొందిన వేదికపై పూర్తి గిరిజన సంప్రదాయ దుస్తుల్లో హాజరయిన వ్యక్తి ఫోటోను పోస్ట్‌ చేసి.. సంస్కృతిని మించిది ఏదీ లేదు అంటూ ఓ కామెంట్‌ పెట్టారు.

Culture se badhkar kuch nahi

A post shared by Virender Sehwag (@virendersehwag) on

దీనిపై స్పందించిన నెటిజన్లు.. వేసుకున్న దుస్తులనుబట్టి ఎవరినీ తక్కువ అంచనా వేయలేం... ఆ వ్యక్తి వస్త్రాధరణ మనకు చూడడానికి ఇబ్బందికరంగా ఉన్నా వారి దేశంలో అది సర్వసాధారణం..అంటూ స్పందించారు. 21వ శతాబ్ధంలోనూ వెస్టర్న్ కల్చర్‌ను ఫాలో కాకుండా ఉన్నారంటే ఆయన నిజంగా చాలా గొప్ప వ్యక్తి అంటూ మరో నెటిజన్‌ పొగడ్తలతో ముంచెత్తారు.

న్యూయార్క్‌లోని యూనైటెడ్‌ నేషన్స్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో 'గ్లోబల్‌ వార్మింగ్‌' పై ఈ ఏడాది మే నెలలో జరిగిన సదస్సులో వెస్టర్న్‌ గునియా(పపువా)కు చెందిన ఓ అధికారి పూర్తి సంప్రదాయ దుస్తుల్లో హాజరయ్యారు. అప్పుడు ఆయన వేసుకున్న దుస్తులు సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. వివిధ దేశాల నుంచి హాజరైన అధికారుల మధ్యలో కూర్చున్న ఆ వ్యక్తి న్యూ గునియా దేశం తరఫున ప్రాతినిధ్యం వహించారు.

మరిన్ని వార్తలు