విరుష్కల పెళ్లి ప్రకటనే ‘గోల్డెన్‌ ట్వీట్‌’

27 Dec, 2017 04:20 IST|Sakshi

ముంబై: ట్వీటర్‌లో ఈ ఏడాది ఎక్కువ మంది మాట్లాడుకున్న సంఘటనగా విరుష్కల పెళ్లి నిలిచింది. భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ కోహ్లిని పెళ్లి చేసుకున్నట్లు బాలీవుడ్‌ నటి అనుష్కా శర్మ ట్వీటర్‌లో ప్రకటించడం తెల్సిందే. ఈ విషయాన్నే ఈ ఏడాది ‘గోల్డెన్‌ ట్వీట్‌’గా ట్వీటర్‌ అభివర్ణించింది. అలాగే ప్రముఖల జాబితాలో షారుక్, సల్మాన్‌ల గురించి ఈ ఏడాది ఎక్కువ మంది ట్వీటర్‌లో మాట్లాడుకున్నారు. కాగా, మహిళా నటుల్లో వివాదాస్పద చిత్రం ‘పద్మావతి’లో నటించిన హీరోయిన్‌∙ దీపికా పదుకొనె గురించి ఈ ఏడాది ట్వీటర్‌లో ఎక్కువ మంది మాట్లాడుకున్నారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా