మోదీ పాట.. గార్భా స్టెప్పులతో అదరగొట్టిన యువతులు

13 Oct, 2018 20:46 IST|Sakshi

ప్రస్తుతం దేశమంతా దేవీ నవరాత్రోత్సవాల్లో మునిగిపోయింది. ముఖ్యంగా ఉత్తరభారత దేశంలో ఈ ఉత్సవాలు ఎంత ఘనంగా నిర్వహిస్తారో తెలిసిన విషయమే. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారికి నిత్యం పూజలు చేస్తూ, భజనలతో అర్చించడం, సంప్రదాయ నృత్యాలతో అలరించడం పరిపాటి. కాగా దేవీ నవరాత్రులను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ తన మాతృభాష గుజరాతీలో ఓ పాటను రాశారు. ‘గాయితోనో గర్బో.. నే జీలే తెనో గర్బో’  అనే పల్లవితో సాగే ఈ పాటకు సుమారు 200 మంది అంధ(పాక్షికం) విద్యార్థినులు అదిరిపోయే స్టెప్పులేసి శోభ తీసుకువచ్చారు. మ్యూజిక్‌కు అనుగుణంగా గుజరాతీ సంప్రదాయ నృత్యం ‘గర్భా’ను ప్రదర్శించి తమలో దాగున్న కళను పరిచయం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

మరిన్ని వార్తలు