వికె సింగ్ తో మోడీకి తలనొప్పి

11 Jun, 2014 14:16 IST|Sakshi
వికె సింగ్ తో మోడీకి తలనొప్పి
రిటైర్డ్ జనరల్, కేంద్ర మంత్రి వికె సింగ్ వివాదాలకు కేరాఫ్ చిరునామాగా మారారు. ఆయన ఇదివరకు యూపీఏ సర్కారుకి తలనొప్పిగా ఉంటే, ఇప్పుడు నరేంద్ర మోడీ సర్కారుకు సెగ్గడ్డలా మారారు. అప్పట్లో తన వయస్సు కారణంగా ఆయన మన్మోహన్ ని ఇబ్బంది పెట్టిన వికె సింగ్ ఇప్పుడు కొత్త ఆర్మీ చీఫ్ పై ట్విట్టర్ లో విమర్శలు చేసి, మోడీకి సమస్యగా మారారు.
 
కొత్త ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ సుహాగ్ నియమకాన్ని వికె సింగ్ వ్యతిరేకిస్తున్నారు. ఆయన తన కింద పనిచేసిన సైనికుల దోపిడీని సమర్థించారని వికె సింగ్ ఆరోపించారు. ఆయనను ఎంపికచేయడం ప్రభుత్వం చేసిన పొరబాటని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఆయనను యూపీఏ ప్రభుత్వం చివరి ఘడియల్లో నియమించినా, మోడీ సర్కారు దానిని సమర్ధించింది. కాబట్టి సింగ్ వ్యాఖ్యలు తన ప్రభుత్వాన్నే విమర్శించినట్టవుతుంది. ఇప్పటికే జనరల్ సుహాగ్ కి వ్యతిరేకంగా లెఫ్టినెంట్ జనరల్ రవి దాస్తానే ఒక కేసు దాఖలు చేశారు. ఆ కేసు సుప్రీంకోర్టు చేరుకుంది. వికె సింగ్ కి, సుహాగ్ కి గతం నుంచీ వైరం ఉంది. మే 2012 లో ఈశాన్య భారతంలో పనిచేస్తున్న కాలంలో లభించిన రహస్య సమాచారాన్ని సరిగా ఉపయోగించలేదని పేర్కొంటూ ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు వికె సింగ్. 
 
కాంగ్రెస్ ఇప్పుడు ఆయనను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తోంది. 
>
మరిన్ని వార్తలు