ఓటు బ్యాంకు కోసమే వర్గీకరణ

26 Jul, 2016 03:18 IST|Sakshi

- మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య
 సాక్షి, న్యూఢిల్లీ: ఒక వర్గం వారి ఓటు బ్యాంకు కోసం అగ్రవర్ణ పార్టీలు దళితులను విభజించి పాలించాలని చూస్తున్నాయని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య ఆరోపించారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఎస్సీల్లో వెనుకబడిన ఉపకులాలకు ప్రత్యేక విద్యా సదుపాయాలు కల్పిస్తే వారు మిగతా విద్యార్థులతో సమానంగా పోటీపడి ఉద్యోగాలు పొందుతారని, ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు లేకుండా రిజర్వేషన్లు కల్పించినా నిరుపయోగమని పేర్కొన్నారు.
 
 ప్రభుత్వాలు ఈ పని చేయకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసం దళితులను విభజించి పాలిస్తున్నారని మండిపడ్డారు. దళితులను విభజించవద్దని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌ను కలసి వినతి పత్రం సమర్పించినట్టు చెన్నయ్య తెలిపారు. దీనికి  ఆయన సానుకూలంగా స్పందిచినట్టు పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద మాల మహానడు చేపట్టిన రిలే  నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. అమలాపురం ఎంపీ రవీంద్రబాబు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు.

మరిన్ని వార్తలు