బిహార్లో తుది విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభం

5 Nov, 2015 07:22 IST|Sakshi
బిహార్లో తుది విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభం

పాట్నా : బీహార్ అసెంబ్లీకి తుది విడత ఎన్నికల పోలింగ్ గురువారం ప్రారంభమైంది. ఉదయం 7.00 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ తుది దశ ఎన్నికల పోలింగ్ లో రాష్ట్రంలోని 9 జిల్లాల్లోని మొత్తం 57 స్థానాలకుగాను 827 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచిచారు. సీమాంచల్లోని 24 స్థానాలు... మిథిలాంచల్తోపాటు కోషి ప్రాంతాల్లోని 33 స్థానాల్లో ఈ ఎన్నికలు జరగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ ఆరు స్థానాల్లో తమ అభ్యర్థులను నిలిపింది.

ఈ ఎన్నికల్లో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా  ఎన్నికల సంఘం భారీగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. బీహార్లోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గతనెల అక్టోబర్ 12 నుంచి నవంబర్ 5వ తేదీ వరకు మొత్తం ఐదు దశల్లో పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. గత నాలుగు దశల్లో 243 స్థానాలకు గాను 186 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఓటర్లు ఏ పార్టీకి పట్టం కడతారు అనేది నవంబర్ 8వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపు ద్వారా అభ్యర్థుల భవితవ్యం తెలనుంది.

మరిన్ని వార్తలు