ప్రీతీ జింటా వెంట పడొద్దు!

19 Jun, 2014 02:55 IST|Sakshi
ప్రీతీ జింటా వెంట పడొద్దు!

మాఫియా డాన్ బెదిరించినట్లు వాడియా గ్రూప్ ఫిర్యాదు
 ముంబై: బాలీవుడ్ నటి ప్రీతీ జింటా, ఆమె మాజీ ప్రియుడు నెస్‌వాడియా మధ్య వివాదం కొత్త మలుపు తిరిగింది. ఓ మాఫియా డాన్ నుంచి తమకు బెదిరింపు కాల్‌తో పాటు మెసేజ్ వచ్చిందంటూ వాడియా గ్రూప్ సంస్థ తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రీతిని వేధింపులకు గురిచేస్తే తమ వ్యాపారం సజావుగా సాగదంటూ అజ్ఞాతంలో ఉన్న మాఫియా నేత రవి పూజారీ పేరుతో ఈ నెల 16న తమకు బెదింపు కాల్స్ వచ్చాయని నెస్‌వాడియా తండ్రి నుస్లీ వాడియాకు వ్యక్తిగత కార్యదర్శులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు ముంబై పోలీసులకు తెలిపారు.

మరిన్ని వార్తలు