నేను నా భర్తతోనే ఉంటా: హదియా

26 Nov, 2017 02:56 IST|Sakshi

కొట్టాయం: కేరళలో ఇస్లాం స్వీకరించి ముస్లిం యువకుడు షఫీన్‌ జహాన్‌ను పెళ్లాడిన అఖిల ఆశోకన్‌ అలియాస్‌ హదియా(25) తాను తన భర్తతోనే కలిసి ఉంటానని స్పష్టం చేశారు. ‘లవ్‌ జిహాద్‌’ కేసుగా పేరుగాంచిన ఈ వ్యవహారంలో నవంబర్‌ 27న ఆమె సుప్రీంకోర్టు ముందు హాజరుకానుంది. ‘నేను ముస్లింను. నన్ను ఇస్లాంలోకి మారాలని ఎవ్వరూ బలవంతపెట్టలేదు. నా భర్త జహాన్‌తోనే ఉండాలనుకుంటున్నాను’ అని కోచి విమానాశ్రయంలో అరుస్తూ విలేకరులతో చెప్పింది. వెంటనే హదియాను ఆమె తల్లిదండ్రులు, పోలీసులు బలవంతంగా విమానాశ్రయం లోపలికి తీసుకెళ్లిపోయారు.

మరిన్ని వార్తలు