ఇక్కడే తస్లీమా జీవించాలని ఎందుకు కోరుకుంటోంది!

6 Aug, 2014 14:34 IST|Sakshi
ఇక్కడే తస్లీమా జీవించాలని ఎందుకు కోరుకుంటోంది!
న్యూఢిల్లీ: భారత్ లోనే జీవించాలనుకుంటున్నానని వివాదస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ అన్నారు. నాకు యూరప్ పౌరసత్వం, అమెరికాలో శాశ్వత నివాసి హోదా ఉంది. నేను ఎక్కడైనా జీవించడానికి అవకాశం ఉంది. ఒక వేళ బంగ్లాదేశ్ అనుమతిచ్చినా.. భారత్ లోనే నా శేష జీవితాన్ని గడపడానికి ఇష్టపడుతాను అని పీటీఐ ఇచ్చిన ఇంటర్వ్యూలో తస్లీమా అన్నారు. 
 
గత 20 ఏళ్లలో భారత దేశంలో ఎంతో మంది స్నేహితులు ఏర్పడ్డారు. ఓ సిద్దాంతం ప్రకారం జీవించాలని భావిస్తే... బంధువులు కూడా అవసరం లేదని ఆమె అన్నారు. నీపై ఎంతమంది విశ్వాసం కలిగి ఉన్నారనేదే చివరకు ముఖ్యం.. వారే నా బంధువులు అని అన్నారు. బంగ్లాదేశ్ తో నా సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి అని తస్లీమా తెలిపారు. 
 
భారత్ లో రెండు నెలలు నివసించడానికి తస్లీమాకు ఆగస్టు 1 తేది నుంచి భారత ప్రభుత్వం అనుమతించింది. సుదీర్ఘ కాలం జీవించడానికి అనుమతించాలని హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను తస్లీమా కలిశారు. 
మరిన్ని వార్తలు