నిజంగా ఇది నమ్మశక్యం కాని విషయం

30 Apr, 2020 10:48 IST|Sakshi

ఢిల్లీ : పైథాన్‌ ఒక జింకను నిమిషాల వ్యవధిలో మింగేయడం మీరెప్పుడైనా చూశారా.. ఒకవేళ చూడకపోతే మాత్రం వెంటనే ఈ వీడియో చూడండి. ఈ వీడియోను ఇండియన్‌ ఫారెస్ట్‌ అధికారి పర్వీన్‌ కశ్వాన్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేశారు. ' ఇది నిజంగా నమ్మశక్యం కాని విషయం. ఎంత ఆకలేసిందో తెలియదు గానీ  బర్మెస్‌ జాతికి చెందిన పైథాన్‌ చూస్తుండగానే నిమిషాల వ్యవధిలోనే జింకను మింగేసిందంటూ' క్యాప్షన్‌ జత చేశాడు. ఇంతకుమందు మనం చూసిన చాలా వీడియోల్లో పైథాన్‌ కుందేళ్లు, ఇతర చిన్న జంతువులను తినడం చూశాము. కానీ మొత్తం రెండు నిమిషాల నిడివి ఉన్న వీడియోలో పైథాన్‌ జింకను చుట్టూసి మెళ్లిగా నోరును పెద్దది చేస్తూ చూస్తుండగానే స్వాహా చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన తర్వాత పాములకు అంత జీర్ణశక్తి ఎక్కడి నుంచి వస్తుందనే అనుమానం తప్పకుండా కలుగుతుంది.  (వైరల్‌: చెవిలో గూడు కట్టిన ‘స్పైడర్’)

మరిన్ని వార్తలు