వైర‌ల్ : మీరిచ్చిన బ‌హుమ‌తి ఎప్ప‌టికి గుర్తుంటుంది

18 Apr, 2020 20:55 IST|Sakshi

మాన్సా : త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల మొద‌టి పుట్టిన రోజు వేడుకల‌ను పెద్ద పండ‌గ‌లా  నిర్వ‌హిస్తారు.  త‌మ బంధువుల‌ను, మిత్రుల‌ను పిలిచి అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుపుతారు. వారి జీవితంలో అదొక మ‌రుపురాని జ్ఞాపకంగా మ‌లుచుకోవాల‌ని అనుకుంటారు. కానీ క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌స్తుతం ప‌రిస్థితులు త‌ల‌కిందుల‌య్యాయి. దేశం మొత్తం లాక్‌డౌన్లో ఉండ‌డంతో జ‌నాలంతా ఇళ్ల‌కే ప‌రిమితమ‌య్యారు.  ఇక బ‌ర్త్‌డే పార్టీల సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు.

అయితే పంజాబ్‌లోని మ‌న్సా పోలీస్ అధికారులు ఒక చిన్నారి  పుట్టిన రోజు వేడుక‌లు వినూత్న రీతిలో నిర్వ‌హించారు. త‌మ బైక్‌పై వ‌చ్చిన  కొంద‌రు పోలీసులు లాక్‌డౌన్‌ డ్యూటీ చేస్తూనే ఒక ఇంటికి వెళ్లి మొద‌టి పుట్టిన రోజు జ‌రుపుకుంటున్న చిన్నారి త‌ల్లికి కేకును అందించారు. అంతేగాక త‌ర్వాత హ్యాపి బ‌ర్త్‌డే పాట‌ను పాడి చిన్నారిని దీవించి అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. లాక్‌డౌన్ పుణ్యానా త‌మ పాప‌కు ఫ‌స్ట్ బ‌ర్త్‌డే వేడుకలు చేయ‌లేక‌పోయామ‌న్న నిరాశలో ఉన్న త‌ల్లిదండ్రుల‌కు పోలీసుల ప‌ని ఆనందాన్ని క‌లిగించింది. (క‌రోనా : పోలీసుల ఐడియా అదుర్స్‌)

ఇదే విష‌యం పోలీసుల‌ను అడిగితే..  మేం చేసిన పుట్టిన రోజు  వేడుక‌లు పాప‌కు గుర్తు కూడా ఉండ‌దు. కానీ ఇటువంటి క్లిష్ట స‌మ‌యంలో పాప మొద‌టి పుట్టిన రోజు వేడుకలు జ‌ర‌ప‌డం మాకు సంతోషాన్నిస్తుంది. అంతేగాక పాప త‌ల్లిదండ్రులు ఈ విష‌యాన్ని ఎప్ప‌టికి మ‌రిచిపోరు. పాప పెద్ద‌య్యాక దీని గురించి త‌ప్ప‌క వివ‌రిస్తారంటూ చెప్పుకొచ్చారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ వీడియో చూసిన ప్ర‌తి ఒక్క‌రు పోలీసుల ప‌నిని మెచ్చుకోకుండా ఉండ‌లేక‌పోతున్నారు. 

మరిన్ని వార్తలు