రిజర్వాయర్లలో పడిపోతున్న నీటిమట్టం

30 Jun, 2017 17:32 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 91 ప్రధాన రిజర్వాయర్లలో నీటి నిల్వలు మొత్తం సామర్థ్యంలో 19 శాతానికే పరిమితమైనట్లు కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ తెలిపింది. నాగార్జున సాగర్, ఇందిరా సాగర్, భాక్రానంగల్‌ తదితర రిజర్వాయర్లలో ఈ వారాంతంలో 29.665 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల నీరు ఉన్నట్లు పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్, రాజస్తాన్, ఒడిశా, ఉత్తరాఖండ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో గతేడాది కంటే నీటి నిల్వలు తక్కువగా నమోదైనట్లు వెల్లడించింది. పంజాబ్, పశ్చిమబెంగాల్, తెలంగాణ, త్రిపుర, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక రాష్ట్రాల్లో గత ఏడాది కంటే నీటి నిల్వలు పెరిగినట్లు జలవనరుల శాఖ పేర్కొంది.
 

మరిన్ని వార్తలు