సుచీంద్రం ఆలయాన్ని ముంచెత్తిన వరద

1 Dec, 2017 14:08 IST|Sakshi

సాక్షి, చెన్నై : ఓక్కి తుపాను తమిళనాడు, లక్షద్వీప్‌ను అతలాకుతలం చేస్తోంది. భీకరమైన ఈదురుగాలులు, ఎగిసిపడుతున్న అలలతో తీర ప్రాంతం భీకరంగా ఉంది.  తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఇప్పటివరకూ 8 మంది మరణించగా 90 మంది ఆచూకీ గల్లంతయింది. తమిళనాడులో పరిస్థితి మరింత తీవ్రంగా ఉండడంతో 7 జిల్లాల్లోని పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.

కన్యాకుమారి వద్ద సముద్రం ఉప్పొంగింది. ప్రఖ్యాత సుచీంద్రం ఆలయం లోపలికి సముద్రపు నీరు చొచ్చుకువచ్చింది. ఆలయంలోని ముఖమంటపం మొత్తం నీరు నిండిపోయింది. దీంతో ఆలయాన్ని అధికారులు మూసేశారు.

లక్షద్వీప్‌లో సముద్రం హోరెత్తుతోంది. అలలు ఎగిసిపడుతున్నాయి. తీరప్రాంతంలోని రిసార్టుల్లోకి సముద్రపు నీరు ప్రవేసించింది.

మరిన్ని వార్తలు