వారంతా ఏమయ్యారో?

12 Dec, 2016 13:51 IST|Sakshi
వారంతా ఏమయ్యారో?

కాన్పూర్‌: ‘గాఢ నిద్రలో ఉండగా ఒక్కసారిగా పెద్ద కుదుపు. మేలుకుని చూసేసరికి బోగీలు పక్కకు పడిపోయివున్నాయి. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. నేను 5వ నంబర్‌ బోగీలో ఉన్నాను. నాతో పాటు వచ్చిన నలుగురైదుగురు కనిపించకుండా పోయారు. వారంతా ఏమయ్యారోనని ఆందోళనగా ఉంది. మహాకాళి దయతోనే నేను బతికి బయటపడ్డాన’ని పట్నా-ఇండోర్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ప్రయాణికుడొకరు తెలిపారు.

‘మేము లక్నోలో దిగ్సాలివుంది. హఠాత్తుగా పెద్ద కుదుపు వచ్చి, పక్కకు పడిపోయాం. మాతో పాటు వచ్చిన ఐదుగురు జాడ తెలియడం లేద’ని ఓ యువతి వాపోయింది. కాన్పూర్‌ సమీపంలో పట్నా-ఇండోర్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో 63 మంది మృతి చెందారు. 150 మందిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను కాన్పూర్‌ లోని ఆస్పత్రులకు తరలించారు. నిలిచిపోయిన ప్రయాణికులను ప్రత్యేక రైలులో మలాసా రైల్వే స్టేషన్‌ కు తరలించారు.

మరిన్ని వార్తలు